Friday, April 26, 2024

థార్ మార్ థ‌క్క‌ర్ మార్ ఫుల్ లిరిక‌ల్ వీడియో సాంగ్ -ఆక‌ట్టుకుంటోన్న చిరు..స‌ల్మాన్ ల స్టెప్స్

థార్ మార్ థ‌క్క‌ర్ మార్ ఫుల్ లిరిక‌ల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. గాడ్ ఫాద‌ర్ మూవీలోది ఈ సాంగ్. కాగా మెగాస్టార్ చిరంజీవి..బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ క్రేజీ కాంబోలో వ‌చ్చే ఈ పాట స్టైలిష్‌గా సాగింది. ఈ పాట‌కు ప్ర‌భుదేవా నృత్య‌రీతులు స‌మకూర్చాడు.అనంత‌శ్రీరామ్ ఈ సాంగ్‌ను రాయ‌గా..శ్రేయో ఘోష‌ల్ పాడింది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు. గాడ్ ఫాద‌ర్‌ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌లవుతుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీ రోల్‌లో న‌టిస్తున్నాడు..గాడ్ ఫాద‌ర్‌లో స్టార్‌ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తోపాటు స‌త్యదేవ్, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిన్నారు. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement