Thursday, April 25, 2024

Big Mistake: సావర్కర్ ఫ్రీడమ్​ ఫైటర్​ ఎప్పుడయ్యారు?.. ‘భారత్​ జోడో’ పోస్టర్లపై కామెంట్స్​

కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్టాత్మక ర్యాలీ, భారత్ జోడో యాత్రలో పెను దుమారం చెలరేగింది. 14వ రోజున పార్టీ అధినేత రాహుల్​ గాంధీ కేరళలోని ఎర్నాకులం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్​తో కలిసి నడిచేందుకు పార్టీ నాయకత్వం కిందిస్థాయి కార్యకర్తలను రప్పిస్తోంది. అయితే వారి ర్యాలీ కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చేరుకోగానే వారికి ఊహించని పొరపాటు ఒకటి ఎదురయ్యింది.

పాదయాత్ర పోస్టర్‌లో వీడీ సావర్కర్ ఫొటో ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. సావర్కర్​ ఇతర స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి ఉన్న ఫొటో పలు బ్యానర్లు, బోర్డులలో కనిపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ సావర్కర్‌ను ఎప్పుడూ స్వాతంత్ర్య సమరయేధుడిగా గుర్తించలేదు. అతను బ్రిటిష్ వారితో పోరాడకుండా క్షమాపణలు మాత్రమే చెప్పాడని పార్టీ నేతలు చెబుతుంటారు.

ఈ విషయాన్ని తొలుత కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ గమనించారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా చెంగమనాడ్‌లో ఉంచిన బోర్డులపై సావర్కర్ ఫొటో ఉందని అన్వర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.  సావర్కర్​ ఫొటో కనిపించకుండా ప్రస్తుతం మహాత్మా గాంధీ ఫొటోతో కవర్​ చేశారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement