Sunday, April 28, 2024

Army Update: టెరిటోరియల్​ ఆర్మీ ఆఫీసర్​ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, లక్ష పైనే జీతం!

టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన గుడ్​ న్యూస్​ వచ్చింది. దీని రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన లేటెస్ట్​ అప్​డేట్​ని టెరిటరీ ఆర్మీ ప్రకటించింది. ఈ జూన్25  నుండి జులై 1వ తేదీ మధ్యలో రిక్రూట్​మెంట్​కు చెందిన పలు అంశాలను పేపర్లలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను రిలీజ్​ చేస్తోంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు www.joinerritorialarmy.gov.inలో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెరిటోరియల్ ఆర్మీ రిజిస్ట్రేషన్ విండో జూలై 1వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇక.. దరఖాస్తుదారులు రాత పరీక్ష కోసం లెటర్​ వస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2022లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని పరిశీలిస్తూ ఉండాలని అధికారులు తెలిపారు.

టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు

  1. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ – 01 జులై 2022
  2. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ – 30 జూలై 2022
  3. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ పరీక్ష తేదీ – సెప్టెంబర్ 2022

టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీ వివరాలు

  1. పురుషులు – 12
  2. స్త్రీ – 01

టెరిటోరియల్ ఆర్మీ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

1) టెరిటోరియల్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – www.jointerritorialarmy.gov.in కి లాగిన్​ కావాలి

- Advertisement -

2) ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి..

3) వివరాలను పూరించాలి

4) దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్​ చేస్తున్నప్పుడు పరీక్ష కేంద్రం ఎంపిక గురించి జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి

5) చివరగా సబ్మిట్ పై క్లిక్ చేయాలి

అప్లికేషన్ ఫీ..

అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 200/-

వయో పరిమితి : 18 నుండి 42 సంవత్సరాలు

విద్యా అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ.

ఎంపిక ప్రక్రియ : సంబంధిత టెరిటోరియల్ ఆర్మీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ నుండి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డ్ (PIB) ద్వారా స్క్రీనింగ్ (రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించబడుతుంది) చేయబడుతుంది.

టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ జీతం :

  1. మ్యాట్రిక్స్ లెఫ్టినెంట్ రూ. 56,100 ‌–1,77,500
  2. కెప్టెన్ రూ. 61,300 ‌–1,93,900
  3. మేజర్​ రూ. 69, 400 – 2,07,200
  4. లెఫ్టినెంట్ కల్నల్ రూ. 1,21,200 – 2,12,400
  5. కల్నల్ రూ. 1,30,600 – 2,15,900
  6. బ్రిగేడియర్ 1,39,600 – 2,17,600
Advertisement

తాజా వార్తలు

Advertisement