Sunday, April 28, 2024

Breaking: విజయవాడలో 144 సెక్షన్‌.. ‘చలో సీఎంవో’పై టెన్షన్

విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ‘చలో సిఎంవో’కి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడలో 144 సెక్షన్‌ విధించారు. పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేస్తున్నారు. చలో సీఎంవోకు అనుమతి లేదని, ఎట్టిపరిస్థితుల్లో రాజధానికి రావద్దని సూచించారు. ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే విజయవాడ సీపీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకోకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల దగ్గర అడ్డుకుంటున్నారు. యూటీఎఫ్‌ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement