Monday, April 29, 2024

మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన టెన్సిస్ స్టార్ మారియా ష‌ర‌పోవా-థియోడ‌ర్ గా నామ‌క‌ర‌ణం

మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది టెన్సిస్ స్టార్ మారియా ష‌ర‌పోవా.. అయిదు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌తో పాటు మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ మారియా ష‌ర‌పోవా ఒక‌ప్పుడు టెన్నిస్‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. బాబుకు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. బ్రిటీష్ వ్యాపార‌వేత్త అలెగ్జాండ‌ర్ గిల్కేస్‌ను ష‌ర‌పోవా పెళ్లాడింది. డిసెంబ‌ర్ 2020లో వాళ్లు ఎంగేజ్ అయ్యారు. జూలై ఒక‌టో తేదీన థియోడ‌ర్ జ‌న్మించిన‌ట్లు ఆమె తెలిపింది. ఏప్రిల్‌లో ప్రెగ్నెంట్ అని ష‌ర‌పోవా ప్ర‌క‌టించింది. 2004లో వింబుల్డ‌న్‌, 2006లో యూఎస్ ఓపెన్‌, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌, ఇక 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది.కాగా త‌మ కుమారుడికి థియోడ‌ర్ అని పేరు పెట్టామ‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement