Friday, May 3, 2024

‘ఆర్ ఆర్ ఆర్’ కి తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ – టికెట్ల ధ‌ర‌లు పెంచుకునే ఛాన్స్

ఆర్ ఆర్ ఆర్ చిత్ర ద‌ర్శ‌క‌..నిర్మాత‌ల‌కి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్ర‌భుత్వం. సాధారణ థియేటర్లలో తొలి మూడు రోజులకు రూ. 50, ఆ తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు ఐమ్యాక్స్ థియేటర్లు, స్పెషల్ కేటగిరీ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ. 100, ఆ తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవబోతోంది. రూ. 450 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, శ్రియ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement