Thursday, May 2, 2024

ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే తెలంగాణలో ఎంట్రీ!

ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చే కరోనా పేషెంట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణలోని ఆస్పత్రిలో బెడ్‌ కన్ఫర్మేషన్‌ తప్పనిసరి ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌ రోగి అ్మడిషన్‌ కంటే ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 040- 2465119, 9494438351 నెంబర్లకు ఫోన్ చేయాలని స్పష్టం చేసింది. అలాగే అంబులెన్స్‌ లేదా వాహనాలకు సైతం ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించింది.

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్ని కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ వంటివి దొరకని పరిస్థితి ఉంది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆస్పత్రులకు వస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాకట, తమిళనాడులో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బెడ్ల, ఆక్సిజన్‌ తదితర సదుపాయాల కొరత ఉండటంతో వచ్చే పేషెంట్లకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మరోవైపు హైదరాబాద్ కు కరోనా బాధితుల తాకిడి పెరగడంతో రెండు రోజుల క్రితం సరిహద్దులో పోలీసులు అంబులెన్స్ లను ఆపేశారు. దీంతో బాదితులు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆస్పత్రులతో టై అప్‌ లేకుండా పేషెంట్లకు విలువైన సమయం వృథా అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తిరగడం వల్ల రోగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆస్పత్రులన్ని తిరగడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి : తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు?!

Advertisement

తాజా వార్తలు

Advertisement