Tuesday, April 23, 2024

వ్యాక్సిన్ ల‌భ్య‌మైతే 45 రోజుల్లో అంద‌రికీ టీకా – కెటిఆర్

హైదరాబాద్‌, : కొవిడ్‌ వ్యాక్సిన్‌ లభ్యతే ప్రధాన సమస్య అని, రాష్ట్రంలో ప్రస్తుతం తొలి డోసు తీసుకున్న 45 లక్షల మందికి రెండో డోసు ఇవ్వడమే తమ ప్రాధాన్యత అని కేటీఆర్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం ఇప్పటికే అనుమతి పొందిన భారత్‌ బయో టెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ కంపెనీలతో సంప్రదిస్తు న్నామని తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సి నేషన్‌ అంశంలో జాతీయ సగటు కంటే తెలంగాణ ముందుందని పురపా లక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొ న్నారు. ప్రతి 10 లక్షల మంది జనా భాకు దేశం మొత్తంలో 1,29,574 మం దికి వ్యాక్సిన్‌ ఇస్తే తెలంగాణలో 1,41,939 మందికి టీకా ఇచ్చినట్లు గణాంకాలు వెల్లడిం చారు. గురువారం ట్విట్టర్‌లో ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమంలో భాగంగా కొవిడ్‌ సంబంధిత అంశాలపై ట్విట్టరైట్ల సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు 2 గంటల పాటు ఓపిగ్గా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరా బాద్‌ నగరం తెలంగాణ చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాల వారికి కూడా సేవలందిస్తున్నందున కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి ప్రాముఖ్యతనివ్వాలని కోరారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్‌లు ఎక్కువగా పొందడానికి కృషి చేస్తున్నామని, అదే సమయంలో వ్యాక్సిన్‌ తయారీదారులతోనూ చర్చిస్తున్నామన్నారు. జూలై చివరిలో లేదా ఆగస్టు తొలి వారం నుంచి డిమాండ్‌కు తగ్గట్లు టీకాల లభ్యత పెరుగుతుందన్నారు. నీతిఆయోగ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. అప్పటిదాకా వ్యాక్సి నే షన్‌ ఇబ్బందులు తప్పవన్నారు. వ్యాక్సిన్లు గనుక సరిపడా అందుబాటులోకి వస్తే 45 రోజుల్లో రాష్ట్రంలో ఉన్నవారందరికీ టీకా ఇచ్చే మౌలిక సదుపాయాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్‌ తయారీ సాంకేతికత బదిలీ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఫైజర్‌, మోడెర్నా టీకాలకు కూడా త్వరలో కేంద్రం అనుమతిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పుత్నిక్‌ వి టీకా కేంద్రం ఇవ్వగానే ప్రజలకు టీకా అందుబాటులోకి తెస్తామని తెలి పారు. దేశంలో ఎక్కడ వ్యాక్సిన్‌ తయారైనా 85 శాతం కేంద్రానికి ఇవ్వాలని, మిగిలిన 15 శాతంలో రాష్ట్రాలు పోటీపడాల్సి ఉంటుందని తెలిపారు. భారత్‌ బయోటెక్‌ హైదరా బాద్‌లోనే ఉందికదా అని తెలం గాణకు వ్యాక్సిన్లు ఇచ్చి మిగిలిన రాష్ట్రా లకు ఇవ్వండి అని చెప్పే వ్యాక్సిన్‌ ప్రాంతీ యత కుదరదన్నారు. వ్యాక్సిన్‌ తయారీదారు లకు తాము ఇప్పటికే రాయితీలు ఇస్తున్నట్లు వెల్లడించారు. నిజానికి కోవిడ్‌ హైదరాబాద్‌లో నిర్మించను న్న ఫార్మాసిటీకి అంతర్జాతీయ ప్రాముఖ్యతను తీసుకొచ్చిం దని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పక్కనపెట్టి అవసరమైతే చైనా నుంచి సైనోవాక్‌ టీకా కొనుగోలు చేసినా తప్పులేదని అభిప్రాయపడ్డారు. కేసుల గ్రాఫ్‌ తగ్గించడానికే లాక్‌డౌన్‌ విధించామని, దాని పొడిగింపుపై 20వ తేదీన క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రం లో కొత్త కేసుల తగ్గుదల కనిపిస్తున్నట్లుందని చెప్పారు. కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలం గాణలో కేవలం 3.69 శాతం పాజిటివిటీ ఉండగా దేశంలో ఇది 7.59 శాతంగా ఉందన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతామన్నారు. దేశంలో ఆక్సిజన్‌ లభ్యతే ప్రధాన సవాల్‌గా ఉందని, ఆక్సిజన్‌ పంపిణీ పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉందని తెలిపారు. గతేడాది కరోనా తొలి వేవ్‌ సమయంలో తెలంగాణలో ఆక్సిజన్‌ బెడ్‌లు 9213ఉండగా ప్రస్తుత సెకండ్‌ వేవ్‌ సమయానికి వాటి సంఖ్య 20,739కి చేరిందని,ఇదే తెలంగాణలో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏంజరిగిందనేవారి ప్రశ్నకు సమాధానమని పేర్కొన్నారు. ఆక్సిజన్‌ సరఫరాకు సాధ్యమైనంతా చేస్తున్నామని, దీని వల్లే మిగతా రాష్ట్రాల్లో మీరు చూస్తున్న భయంకర సంఘటనలు ఇక్కడ జరగడం లేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల వాడకంపై ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నామని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వాటిని ఎక్కువగా వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇంజక్షన్ల వాడకం విషయంలో డాక్టర్లకు కొవిడ్‌ పేషెంట్‌ల సహాయకుల నుంచి ఒత్తిడి రావడం వల్లే ఎక్కువగా ఇస్తున్నారన్నారు. అయినా ఏ ఆస్పత్రిలోనైనా ఇష్టం వచ్చినట్లుగా వాటిని వాడినా, అవసరాని కంటే ఎక్కువగా నిల్వ చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వాన్ని చెడుగా చూపించడమే వారి పని…
ప్రభుత్వం ఏ మంచి పని చేసినా తీన్మార్‌ మల్లన్న అనే వ్యక్తి తన యూ ట్యూబ్‌ చానల్‌ ద్వారా తప్పుగా చిత్రీకరించి ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళుతున్నారని కేటీఆర్‌ దృష్టికి ఓ అభిమాని తీసుకురాగా మీరే అలాంటి తప్పుడు ప్రచారాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement