Tuesday, April 30, 2024

TSTRC: ప్రయాణికులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన ఛార్జీలు.. డీజిల్‌ సెస్‌ వడ్డించిన ఆర్టీసీ

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చింది. తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీలను పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమలు అవుతున్నాయి. డీజిల్ సెస్ పేరుతో బస్సు చార్జీలను పెంచింది. ఇప్పటికే సేఫ్టీ సెస్, ప్యాసింజర్‌ ఎమినిటీస్‌ సెస్‌ పెంపుతో టికెట్‌ ధరలను సవరించిన ఆర్టీసీ తాజాగా డీజిల్‌ సెస్‌ విధించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై 2 రూపాయలు, ఎక్స్‌ప్రెన్, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై 5 రూపాయల చొప్పున సెస్‌ వడ్డించింది. డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సెస్, దాని రూపంలో టికెట్‌ చార్జీని రౌండ్‌ ఆఫ్‌ చేయడం… వెరసి ఆర్టీసీకి సాలీనా రూ. 100 కోట్ల అదనపు రాబడి సమకూరనుంది. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ వడ్డించిన సెస్‌లు, ఇతర రౌండింగ్‌ ఆఫ్‌ సవరింపులతో జనంపై వార్షికంగా రూ. 350 కోట్ల అదనపు భారం పడినట్టయింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement