Tuesday, May 7, 2024

Spl Story | రాజ్యసభ సభ్యులంతా కోటీశ్వరులే.. చాలామందిపై తీవ్రమైన క్రిమినల్​ కేసులు!​

రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలలో ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువగా కోటీశ్వరులే ఉన్నట్టు స్వయంగా వారు దాఖలు చేసిన అఫిడవిట్​ ద్వారా వెల్లడవుతోంది. ఇక చాలామంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్​ కేసులున్నాయి. అందులో రేప్​ కేసును ఎదుర్కొంటున్న వారు . కొంతమంది మహిళా ఎంపీలపై కూడా క్రిమినల్​ కేసులుండడం గమనార్హం.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఏపీ, తెలంగాణకు చెందిన చాలామంది రాజ్యసభ సభ్యులు కోటీశ్వరులే. అంతేకాకుండా దేశవ్యాప్తంగా రాజ్యసభ సభ్యుల్లో చాలామందిపై తీవ్రమైన క్రిమినల్​ కేసులున్నాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓ రిపోర్ట్​ రిలీజ్​ చేసింది.. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో 12 శాతం మంది కోటీశ్వరులేనని (బిలియనీర్లు) ఆ రిపోర్టులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక శాతం మంది పార్లమెంటేరియన్లు కోటీశ్వరులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR).. నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) 233 మంది రాజ్యసభ ఎంపీలలో 225 మంది నేర, ఆర్థిక.. ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించి, అప్‌డేట్ చేశాయి. ప్రస్తుత రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ నుండి 11 మంది ఎంపీలలో 5 (45 శాతం), తెలంగాణ నుంచి ఏడుగురు ఎంపీలలో 3 (43 శాతం), మహారాష్ట్ర నుండి 19 మంది ఎంపీలలో 3 (16 శాతం), ముగ్గరురిలో ఒకరు (33 శాతం) ఉన్నారు. ఢిల్లీకి చెందిన ఎంపీలు, పంజాబ్‌లోని ఎడుగురు ఎంపీల్లో 2 (29 శాతం), హర్యానాకు చెందిన అయిదుగురు ఎంపీల్లో 1 (20 శాతం), మధ్యప్రదేశ్‌లోని 11 మంది ఎంపీల్లో 2 (18 శాతం) మంది రూ. 100 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు.

- Advertisement -

తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యుల (ఎంపీల) మొత్తం ఆస్తులు రూ.5,596 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.3,823 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.1,941 కోట్లుగా ఉంది.  225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో 75 మంది అంటే 33 శాతం తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.

అలాగే దాదాపు 41 (18 శాతం) రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలు తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. ఇద్దరు సభ్యులు హత్యకు సంబంధించిన కేసులను ప్రకటించారు (IPC సెక్షన్ 302). నలుగురు రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నట్టు సమాచారం.  4 ఎంపీలలో, రాజస్థాన్‌కు చెందిన ఒక రాజ్యసభ సిట్టింగ్ ఎంపీ – కాంగ్రెస్‌కు చెందిన కెసి వేణుగోపాల్ అత్యాచారానికి సంబంధించిన కేసును (ఐపిసి సెక్షన్ 376) ఎదుర్కొంటున్నారు.

బీజేపీకి చెందిన 85 మంది రాజ్యసభ ఎంపీల్లో 23 మంది (27 శాతం), కాంగ్రెస్ నుంచి 30 మంది ఎంపీల్లో 12 మంది (40 శాతం), ఏఐటీసీ నుంచి 13 మంది ఎంపీల్లో 4 (31 శాతం), 5 (83 శాతం) మంది ఆర్జేడీ నుంచి 6 ఎంపీలు, సీపీఐ(ఎం నుంచి 5 ఎంపీల్లో 4 (80 శాతం), ఆప్ నుంచి 10 ఎంపీల్లో 3 (30 శాతం), వైఎస్సార్సీపీ నుంచి 9 ఎంపీల్లో 3 (33 శాతం), 2 ( NCPకి చెందిన 3 రాజ్యసభ ఎంపీలలో 67 శాతం మంది తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement