Tuesday, April 30, 2024

ఏసీబీకి భయపడి డబ్బులను తగులబెట్టిన తహసీల్దార్

ఓ త‌హ‌సీల్దార్ ఏసీబీకి భ‌య‌ప‌డి ఏకంగా రూ.20 ల‌క్ష‌ల క‌రెన్సీ నోట్ల‌ను త‌గుల‌బెట్టాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని సిరోహి జిల్లాలో బుధ‌వారం రాత్రి జ‌రిగింది. తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ త‌రఫున ఓ వ్య‌క్తి నుంచి రూ.ల‌క్ష లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ ప‌ర్వ‌త్ సింగ్ ప‌ట్టుబ‌ట్టాడు. దీంతో ఏసీబీ అధికారులు త‌న ఇంట్లోకి రాక ముందే అన్ని డోర్లు మూసేసి త‌న ద‌గ్గ‌ర ఉన్న కరెన్సీ నోట్ల‌ను త‌హ‌సీల్దార్ క‌ల్పేష్ త‌గుల‌బెట్టేశాడు.

తాము క‌ల్పేష్ ఇంట్లోకి వెళ్ల‌డానికి ముందే అత‌డు అన్ని డోర్లు మూసేశాడ‌ని ఏసీబీ డీజీ బీఎల్ సోనీ వెల్ల‌డించారు. ఎలాగోలా స్థానిక పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లామ‌ని, అయితే అత‌డు అప్ప‌టికే కిచెన్‌లో ల‌క్ష‌ల క‌రెన్సీ నోట్ల‌ను త‌గుల‌బెట్టేశాడ‌ని చెప్పారు. ఇంట్లో సోదాలు నిర్వ‌హించ‌గా రూ.1.5 ల‌క్ష‌లు దొరికిన‌ట్లు తెలిపారు. ఆర్ఐ ప‌ర్వ‌త్ సింగ్‌తో పాటు త‌హసీల్దార్ క‌ల్పేష్ కుమార్‌‌ను అరెస్ట్ చేసిన‌ట్లు సోనీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement