Thursday, May 2, 2024

Followup: బంగ్లాపై టీమిండియా గెలుపు.. దూకుడు చూపిన బంగ్లా ఓపెనర్‌ లిటస్‌ దాస్‌

బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు బెర్త్‌ ఖరారు చేసుకుంది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. విరాట్‌ కోహ్లీ (64) పరుగులతో రాణించాడు. టోర్నీల్లో ఫామ్‌లో లేని కెఎల్‌ రాహుల్‌ కూడా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఇక సూర్య కుమార్‌ వేగంగా ఇన్నింగ్స్‌ ఆడాడు. 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి టీమిండియా 184 పరుగులు చేసింది.

టీ 20 ప్రపంచకప్‌ గ్రూప్‌ 2లో బంగ్లాదేశ్‌, ఇండియా మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌ షకీల్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం బంగ్లా జట్టులో ఓ మార్పు జరిగింది. సౌమ్యా సర్కారు స్థానంలో షోరీపుల్‌ ఇస్లామ్‌ను తీసుకున్నారు. భారత్‌ కూడా ఒక మార్పు చేసింది. దీపక్‌ హుడా స్థానంలో మళ్లిd అక్షర్‌ పటేల్‌ను తీసుకున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో దీపక్‌ ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా గ్రూప్‌ 2లో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం అయ్యింది.

చేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో బంగ్లా టార్గెట్‌ను 16 ఓవర్లకు కుదించారు. అయితే నిర్ణీత పరుగులను చేసేందుకు చివరి వరకు పోరాడింది. చివరకు 145 పరుగులకే పరిమితమైంది.
విరాట్‌ కోహ్లీ మరోసారి సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ 20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో కోహ్లీకి ఇది మూడో అర్థ సెంచరీ కావడం విశేషం. టోర్నీలో ఫామ్‌లో లేని ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేశాడు. అతను 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 50 రన్స్‌ చేసి ఔటయ్యాడు.

- Advertisement -

ఇక సూర్యకుమార్‌ వేగంగా ఇన్నింగ్స్‌ ఆడాడు. అతను కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 రన్స్‌ చేశాడు.
చివర్లో అశ్విన్‌ ఆరు బంతుల్లో 13 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 184 పరుగులు చేసింది. భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది అవుతున్న అడిలైడ్‌ పిచ్‌పై బంగ్లా భారీ టార్గెట్‌ను చేజ్‌ చేయలేకపోయింది.

టీ 20 క్రికెట్‌లో కోహ్లీ రికార్డులు
విరాట్‌ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ 20 వరల్డ్‌ కప్‌ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంక బ్యాటర్‌ జయవర్దణ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు. టీ 20 వరల్డ్‌ కప్‌ మ్యాచుల్లో జయవర్దనే 1016 పరుగులు చేశాడు. 31 ఇన్నింగ్స్‌లో అతను ఆ పరుగులు సాధించాడు. అయితే కోహ్లీ ఆ రికార్డును కేవలం 25వ ఇన్నింగ్స్‌లోనే దాటేశాడు. బంగ్లాతో మ్యాచ్‌లో 16 పరుగులు చేయగానే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ సరికొత్త మైలు రాయిని అందుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన టీ 20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో ఇండియా తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్‌ కేవలం 2 రన్స్‌ మాత్రమే చేశాడు. మరో ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ బంగ్లా బౌలర్లపై భారీ షాట్లతో రెచ్చిపోయాడు.. 50 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఇండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఇండియా తొలి పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. అయితే ఫామ్‌లో లేని రాహుల్‌ ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.

టీ 20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా కీలక పోరుకు సిద్దమైంది. మెగా టోర్నీలో టైటిల్‌ దక్కించుకు పోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న భారత్‌ బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడింది. దక్షిణాఫ్రికాతో గత మ్యాచ్‌లో ఓటమి నుంచి తేరుకుని బంగ్లా భరతం పట్టాలని నిర్ణయించుకుని మ్యాచ్‌కు తలపడింది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలవడం ద్వారా సెమీస్‌ బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ఇదిలాఉండగా బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ శర వేగంగా పరుగులు చేశాడు. దూకుడు మీద ఆడాడు. ఇండియన్‌ బౌలర్లను అతను ధీటుగా ఎదుర్కొన్నాడు. 185 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా జట్టు ఆరు ఓవర్ల పవ ర్‌ ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 60 రన్స్‌ చేసింది. లిటన్‌ దాస్‌ 26 బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో 59 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఏడో ఓవర్‌ వద్ద వర్షం పడటంతో మ్యాచ్‌ ను నిలిపి వేశారు. ఏడు ఓవర్లలో బంగ్లా 66 పరుగులు చేసింది. మరోవైపు పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న బంగ్లాదేశ్‌ జట్టు ప్రతిష్టాత్మక పోరులో ఓటమి పాలైంది. దాదాపు మూడేళ్ల తర్వాత పొట్టిపోరులో తలపడి అభిమానులను అలరించి భంగపడింది. 15 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న పట్టుదలతో భారత్‌ కనిపిస్తే పోటీలో నిలవాలని బంగ్లా తహతహలాడింది.

టాప్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌
దుబాయ్‌: జోరు మీదున్న బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ టీ 20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌ కొట్టేశాడు. పాకిస్థాన్‌ క్రికెటర్‌ రిజ్వాన్‌ను వెనక్కి నెట్టేశాడు. ఇప్పటి వరకు రెండు హాఫ్‌ సెంచరీలతో హోరెత్తించిన సూర్య మెన్స్‌ ర్యాంకింగ్స్‌ లోనూ రాకెట్‌లా దూసుకుళుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్య 68 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇదే టోర్నీలో నెదర్లాండ్స్‌ పై కూడా కీలకమైన హాఫ్‌ సెంచరీ చేశాడు. ఐసీసీ టీ 20 బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌ సాధించిన 23వ క్రికెటర్‌గా సూర్య నిలిచాడు. ఇక రెండో ఇండియన్‌ బ్యాటర్‌గా కూడా నిలిచాడు. గతంలో ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన ప్లేయర్ల జాబితాలో విరాట్‌ కోహ్లీ ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement