Friday, May 17, 2024

పెళ్లికి రెడీ అంటున్న తాప్సీ.. త్వరలోనే ఆ ముచ్చట చెబుతుందట..

తాప్సీ.. ఈ మధ్యకాలంలో తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. పర్ఫామెన్స్ కి ప్రాధాన్యం ఉండే పాత్రలు ఎంచుకుంటూ కెరీర్లో దూసుకుపోతుంది ఈ భామ. అయితే.. కొంత కాలంగా తాప్సీ బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా బి టౌన్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి చాలా సార్లు వెకేషన్ కు వెళ్లి కెమెరా కంటికి కూడా చిక్కారు. కానీ, వీరిద్దరు అధికారికంగా దీని గురించి ఇప్ప‌టివ‌ర‌కైతే ప్రకటించలేదు. అయితే లేటెస్ట్ ఇన్‌ఫో ప్రకారం అతి త్వరలోనే తాప్సీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.

తాప్సీ తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించనున్నట్లు టాలీవుడ్‌, బాలీవుడ్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు తెలుగులో ఈమెకు ఆఫర్లు ఎక్కువగా లేకపోయినా బాలీవుడ్లో మాత్రం ఈమె చేతినిండా మంచి మంచి ప్రాజెక్టులున్నాయి. ఈ మధ్యనే “లూప్ లపేట” అనే ఒక టైం లూప్ సినిమాలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్ర‌స్తుతం తాప్సీ చేతిలో “మిషన్ ఇంపాజిబుల్”, “బ్లర్”, “వో లడకి హై కహా”, “శభాష్ మితు”, “దుబారా”వంటి ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement