Sunday, May 19, 2024

Uttarakhand Election: రాహుల్ ఓ ఎన్నికల హిందువు: బీజేపీ నేత సంచలన వ్యాఖ్య

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత తేజిందర్ పాల్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఓ ఎన్నికల హిందువు అని అభివర్ణించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పర్యటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. హర్ కీ పౌరీ ఘాట్ వద్ద గంగానదికి పూజలు చేశారు. ఉత్తరాఖండ్ సంక్షేమం కోసం గంగామాతను ప్రార్థించానని రాహుల్ తెలిపారు.
అయితే, బీజేపీ నేత తేజీందర్ పాల్ సింగ్ బగ్గా దీనిపై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సరిగ్గా ఎన్నికలప్పుడే హిందువులా మారతారని వ్యాఖ్యానించారు. కాబట్టే రాహుల్ హారతి ఇస్తుండగా పూజారి సూచనలు చేయాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement