Wednesday, May 8, 2024

పంజాబ్ లోని ‘గోల్డెన్ టెంపుల్’ లో ఆర్ ఆర్ ఆర్ టీం ప్ర‌త్యేక పూజ‌లు

భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్ బిజీగా ఉంటున్నారు. ప‌లు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సిక్కు మ‌త సంప్ర‌దాయాల ప్ర‌కారం ఎన్టీఆర్, చెర్రీ, రాజ‌మౌళి పూజ‌ల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి నుంచి వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈ నెల 25న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement