Monday, May 13, 2024

సూయజ్ కాలువలో పౌర్ణమి రోజు అద్భుతం

యూరప్, ఆసియా దేశాలను కలిపే సూయజ్ కాలువలో పెద్ద అద్భుతమే జరిగింది. వారం రోజుల క్రితం అనూహ్యంగా సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన ఈ నౌక ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనని దేశ, విదేశాలకు చెందిన పలువురు నిపుణులు భావించారు. కొన్ని దేశాలైతే సూయజ్ కాలువలో ఇప్పట్లో రవాణా నిలిచిపోయినట్లేనని ఓ నిర్ణయానికి వచ్చేశారు. మరోవైపు భారీ క్రేన్లు, టగ్ బోట్ల సాయంతో సిబ్బంది నౌకను కదిలించేందుకు భారీగా శ్రమపడ్డారు. కానీ మానవ శక్తి, సాంకేతిక పరిజ్ఞానం చేయలేని పనిని ప్రకృతి చేసింది.

మానవ తప్పిదం కారణంగా సూయజ్ కాలువలో చిక్కుకున్న ఎవర్ గివెన్ నౌక నౌక బయటకు రావడం కష్టమేనని అందరూ భావిస్తున్న తరుణంలో పౌర్ణమి వచ్చింది. ప్రతి అమావాస్య, పౌర్ణమికి సముద్ర ప్రవాహాల్లో విపరీతమైన మార్పులు జరగడం సాధారణమే. దీంతో పౌర్ణమి రోజు సూపర్ మూన్ దర్శనంతో పాటు సూయజ్ కాలువలో భారీగా అలలు ఎగిసిపడ్డాయి. ఈ దెబ్బకి భారీ నౌక సైతం కదిలిపోయింది. సముద్రంలో 18 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన నౌకను రాకాసి అలలు కాపాడాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన నౌకలోని సిబ్బంది ఆశ్చర్యపోయారు.

నౌక వల్ల జరిగిన నష్టం ఎంతో తెలుసా?

సూయజ్ కాలువలో ఆరు రోజుల పాటు నౌక ఇరుక్కుపోవడంతో రవాణా స్తంభించిపోయింది. దీంతో విదేశాలతో పాటు ఇండియా కూడా వందల కోట్ల నష్టాలను ఎదుర్కొంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం ఈ కాలువ నుంచే జరుగుతుంది. రోజుకు 9 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం ఈ కాలువ ద్వారా జరుగుతుంది. జపాన్ సంస్థ తయారు చేసిన ఈ ఓడ కాలువలో ఆరు రోజుల పాటు ఇరుక్కోవడంతో… 54 బిలియన్లుగా ప్రపంచంలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కేవలం సరుకు రవాణా వల్ల జరిగిన నష్టం. ఆగిపోవడం లేదా ఆలస్యం కారణంగా ఈ నష్టం జరిగింది. ప్రపంచ వాణిజ్య వృద్ధిని 0.2 నుండి 0.4 శాతం వరకు తగ్గించింది అని సమాచారం. అదనపు షిప్పింగ్ ఆపరేషన్ ఛార్జీలు, వస్తువుల ధరలు, షిప్పింగ్ ఆలస్యం వంటి ఖర్చుల నష్టం ఇంకా అంచనా వేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement