Monday, April 29, 2024

సన్నీ లియోన్ అశ్లీల నృత్యం.. ‘మధుబన్ మే రాధిక నాచే పాట‌పై నిషేధం విధించాలే..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మధుర పూజారులు చాలా ఫైర్ అవుతున్నారు. సన్నీలియోన్ డ్యాన్స్ తమకు అస్సలు నచ్చలేదని మండిపడుతున్నారు. సన్నీ లియోన్ లేటెస్ట్ వీడియో ఆల్బమ్‌ పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీలియోన్ “మధుబన్ మే రాధిక నాచే” పాటలో అశ్లీల నృత్యం చేశారని.. ఈ పాటలో చేసిన డ్యాన్స్ తో తమ మనోభావాలను దెబ్బతీశారని వారు ఆరోపిస్తున్నారు.

కాగా, ఈ మ్యూజిక్ వీడియోను సారెగమా మ్యూజిక్ బుధవారం రిలీజ్ చేసింది. కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడిన పాటలో సన్నీ లియోన్ ఉంది. ఈ సాంగ్ ని నిజానికి 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు.

“ప్రభుత్వం ఆ నటికి వ్యతిరేకంగా చర్య తీసుకోకపోతే, ఆమె వీడియో ఆల్బమ్‌ను నిషేధించకపోతే మేము కోర్టుకు వెళ్తాము” అని బృందాబన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ చెప్పినట్లు పీటీఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. సన్నీ లియోన్ ఆ సీన్ నుండి తొలగించాలని, ఆమె తమకు బహిరంగ క్షమాపణలు చెప్పే దాకా ఈ దేశంలో ఉండనివ్వకూడదని సీర్ అన్నారు.

సన్నీ లియోన్ పాటను “అవమానకరమైన రీతిలో” ప్రదర్శించడం ద్వారా బ్రిజ్‌భూమి ప్రతిష్టను కించపరిచారని అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ అన్నారు.

ఈ పాట రాధా, కృష్ణుల మధ్య ప్రేమను చూపించేలా ఉన్నప్పటికీ సన్నీ లియోన్ చేసిన అసభ్యకరమైన డ్యాన్స్, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ని కదలిస్తూ చేసిన విధానం హిందూ మనోభావాలను దెబ్బతీసిందని నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement