Sunday, May 12, 2024

సుమంత్​ కొత్త ప్రాజెక్టు.. లాంఛనంగా ‘అహం రీబూట్​’ ప్రారంభం

సుమంత్ హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్ ప‌ట్టాలెక్కింది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఇవ్వాల లాంఛ‌నంగా ప్రారంభించారు. ద‌ర్శ‌కుడు చందు మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి క్లాప్‌కొట్టారు. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఎస్ ఒరిజిన‌ల్ సంయుక్త నిర్మాణంలో ర‌ఘువీర్ గోరిప‌ర్తి, సృజ‌న్ ఎర‌బోలు స‌మ‌ర్పిస్తున్నారు. ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సుమంత్ ఈ సినిమాలో ఆర్జే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్నారు.

మళ్లీరావా సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడు అక్కినేని హీరో సుమంత్. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఎదురుచూస్తున్న సుమంత్ మళ్లీ రావా సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు ఈ యంగ్ హీరో.. సుమంత్ నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న అహం రీబూట్ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.

అయితే.. సుమంత్ ఆర్జే క్యారెక్టర్ కనిపించనున్న అహం రీబూట్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ప్ రీబూట్, ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని చెబుతున్నాం అని దర్శకుడు ప్రశాంత్ సాగర్ చెప్పుకొచ్చారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement