Thursday, May 2, 2024

Story : ఈసారి రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎందుకింత పోటీ..!

దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు కీల‌కంగా మారాయి. అధికార పార్టీ బిజెపి నుండి రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ద్రౌప‌ది ముర్ము పోటీ చేస్తున్నారు. కాగా విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా పేరు వినిపిస్తోంది. కాగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇంత సీరియ‌స్ గా జ‌రుగుతుండ‌టానికి కార‌ణం లేక‌పోలేదు. ఇదంతా రాబోయే 2024ఎన్నిక‌ల కోస‌మ‌నే విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఈసారి కచ్చితంగా ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ రాద‌నే విశ్లేష‌ణ‌లు చెబుతున్నాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఏ ఒక్క పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధైర్యంగా చెప్పలేని స్థితి. ఇక బీజేపీకి ఇప్పటికే రెండుసార్లుగా ఫుల్ మెజారిటీ ఇచ్చేసిన ప్ర‌జ‌లు.. మూడవసారి కాస్తా మోజు తగ్గి మెజారిటీకి దూరంగా ఉంచుతార‌నే టాక్ వినిపిస్తోంది.

సరిగ్గా ఇలాంటి సమయం కోసమే విపక్షాలు ఎదురుచూస్తున్నాయి. అవన్నీ కలసి ఫ్రంట్ గా మారి రాష్ట్రపతిని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఏర్పాటుకు పిలుస్తారు అన్న ఆశలు ఉన్నాయి. అయితే ఇక్కడే రాష్ట్రపతి పాత్ర చాలా ఇంపార్టెంట్ గా మారింది. విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ప్రభుత్వాన్ని మెజారిటీతో నడుపుతార‌నే నమ్మకం రాష్ట్రపతికి కలిగితే వారినే పిలిచి సర్కార్ ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతారు. అందుకే రాష్ట్రపతి భవన్ లో తాము ప్రతిపాదించిన అభ్యర్ధి గెలిస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే ఈ పోటీ నెల‌కొంది. ఇదిలా ఉంటే రాష్ట్రపతి పదవి అంటే రబ్బర్ స్టాంప్ అనే విమర్శలు చేసేవారికి జవాబు చెప్పాలీ అంటే చాలానే ఉంది. రాష్ట్రపతికి రాజ్యాంగం ప్రకారం చాలా విశేష అధికారాలు ఉన్నాయి. ఆయన ప్రధానిని నియమిస్తారు.. ఆయన మంత్రిమండలి ఇచ్చే సలహాతో తాను ప్రభుత్వాన్ని నడుపుతారు. ఈ దేశంలో అమలు అయ్యే ప్రతీ చట్టం రాష్ట్రపతి సంతకం చేశాకే వెలువడుతుంది. ఇక దేశ అత్యున్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టులలో న్యాయమూర్తులను కూడా ఆయనే నియమిస్తారు. అలాగే త్రివిధ దళాధిపతులకు ఆయన నాయకత్వం వహిస్తారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 నుంచి 360 దాకా పేర్కొన్న మేరకు చూస్తే రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉన్నాయి. అవి ఏంటంటే పౌరులకు ఉన్న ప్రాధమిక హక్కులను ఆయన రద్దు చేయవచ్చు.

అంతేనా పార్లమెంట్ నుంచి బిల్లులు రాష్ట్ర‌ప‌తి ఆమోదం కోసం వస్తే ఆయన తిరస్కరించి పంపే హ‌క్కు కూడా ఉంది. ప్రధానిని ప్రభుత్వాధినేత అని అంటే.. రాష్ట్రపతిని దేశాధినేతగా చెబుతారు. ఎందుకంటే దేశం మొత్తం ఆయన గుప్పిట ఉంటుంది. ఇక ప్రభుత్వాల ఏర్పాటులో రాష్ట్రపతి నిర్ణయం ఫైనల్. ఆయన‌ని ప్రశ్నించే పరిస్థితి అయితే లేదు. అలాగే తాను నియమించిన ప్రధానులకు టైమ్ ఇచ్చి మెజారిటీ నిరూపించుకోమని కోరవచ్చు. వారు అందులో ఫెయిల్ అయితే రాష్ట్రపతిని క్షణాలలో తప్పించవచ్చు. మెజారిటీతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతి తాను అనుకున్న తీరున ప్రధాని పనిచేయలేదు అనుకుంటే ఆ సర్కార్ ని రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. వాటిని విశేష అధికారాలు అని చెబుతారు. రాష్ట్రపతి అంటే నడిచే రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఉన్న న్యాయ శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు అన్నీ ఆయన కంట్రోల్ లోనే పనిచేస్తాయి. అంతటి విశిష్టమైన పదవి కాబట్టే రాష్ట్రపతి పదవి అంటేనే గొప్పగా చూస్తారు. అందుకే ఈ ప‌ద‌వికి త‌మ అభ్య‌ర్థుల‌నే నిల‌బెట్టేందుకు ప్ర‌తి పక్షాల‌తో పాటు..అధికార బిజెపి కూడా పోటీ ప‌డుతుంది. మ‌రి ఈ సారి రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement