Friday, May 17, 2024

Story : జ‌న‌వాణితో జ‌న‌సేన గ‌ట్టెక్కేనా..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో వినూత్న కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల ముందుకు వెళ్లేందుకు కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నుంది జ‌న‌సేన పార్టీ. జ‌న‌వాణి పేరుతో కొత్త కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేశారట‌. ఇందులో భాగంగా జనసేనాని .. ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారని ఆ పార్టీ తెలిపింది. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేలా సామాన్యుడి గళానికి బలానిచ్చేలా జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.కాగా జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ కల్యాణ్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండ‌నున్నారు. ప్రజలు వివిధ అంశాలపై వారి సమస్యలు ..వినతులకు సంబంధించిన అర్జీలను స్వయంగా పవన్ కల్యాణ్ కు అందించివచ్చని ఆ పార్టీ తెలియ‌జేసింది. ఇందులో భాగంగా తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తారు.

ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని జనసేన పార్టీ తెలిపింది.ఇక రెండో ఆదివారం కూడా విజయవాడలోనే జనవాణి కార్యక్రమం ఉంటుందట‌. మూడో ఆదివారం ..నాలుగో ఆదివారం.. ఐదో ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని వరుసగా ఉత్తరాంధ్ర ..రాయలసీమ.. ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తారు. అక్కడ కూడా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొంటారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రాజకీయాలకు అతీతంగా సామాన్యుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్షతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని జనసేన పార్టీ వెల్ల‌డించింది. జనవాణి కార్యక్రమంలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇస్తామని తెలిపింది.అర్జీలు స్వీకరించిన రోజు సాయంత్రమే ఆ సమస్యలను సంబంధిత అధికారులకు చేరవేస్తామని వెల్లడించింది. ఆ తర్వాత ఆ సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తమ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే ఫాలో అప్ చేస్తామని తెలిపింది.మ‌రి ప్ర‌జ‌ల‌కి చేరువ‌య్యేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం ఏ మేర‌కు విజ‌య‌వంతం అవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement