Friday, May 3, 2024

Story : డాక్ట‌ర్లు కాబోయి – యాక్ట‌ర్లు అయింది వీరే

సినీ ఇండ‌స్ట్రీలో న‌టులుగా రాణిస్తున్న వారిలో ఎంతో మంది డాక్ట‌ర్సే అని మీకు తెలుసా..డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యా అనేది కామెడీకే కాదు..అది అక్ష‌రాలా నిజం కూడా..స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు రాణిస్తోన్న సాయిప‌ల్ల‌వి MBBS చదువుతూనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సాధించింది. ఫిల్మ్ కెరీర్ ను చూసుకుంటూనే.. తన MBBS ను కంప్లీట్ చేసింది. పేదవారి డాక్టర్ గా పేరు తెచ్చుకుంటా అంటోంది .. సినిమాల విషయంలో కూడా సెలక్టీవ్ గా వెళ్తోన్న సాయి పల్లవి.. స్టార్ హీరో అని చూడకుండా.. తన పాత్ర ఇంపార్టెన్స్ ను బట్టి సినిమా చేస్తుంది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా… స్టార్ హీరోగా వెలుగు వెలిగిన రాజశేఖర్ కూడా డాక్టరే. తమిళనాడుకు చెందిన రాజశేఖర్.. అక్కడే మెడిసిన్ కంప్లీట్ చేసి.. కొన్నాళ్ళు ప్రాక్టీస్ కూడా చేశారు. ఆతరువాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చిన ఈ హీరో.. కోలీవుడ్ ను వదిలి.. టాలీవుడ్ లో సెటిల్ అయ్యారు.

టాలీవుడ్ లో చాలా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు.. చేస్తున్నాడు భరత్ రెడ్డి. వైజాక్ కు చెందిన.. ఈ డాక్టర్ కి .. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇష్టంతో.. అటు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే.. టైమ చూసుకుని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు.
యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అజ్మిల్ అమీర్ కూడా మెడిసిన్ చదివిన వ్యక్తే. రచ్చ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కంట్లో పడిన ఈ యంగ్ స్టార్ రంగం సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆతరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో వై ఎస్ జగన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. అలనాటి టాలీవుడ్ లెజెండరీ నటులలో కూడా డాక్టర్లు ఉన్నారు.

తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన అల్లు రామలింగయ్య కూడా డాక్టరే. కాని ఆయన ఆయుర్వేదంలో స్పెషలిస్ట్. అటు సినిమాలు చేసుకుంటూనే తనకు వచ్చిన వైద్య‌ వృత్తిని కూడా అప్పుడప్పుడు చేసేవారట.ఇక పాత త‌రం లెజండరీ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా డాక్టరే. ఆయన మెడిసిన్ కంప్లీట్ చేసి.. కొంత కాలం ప్రక్టీస్ చేసిన తరువాత సినిమాలపై ఫుల్ గ్రిప్ తెచ్చుకున్నారట. ఇలా టాలీవుడ్ లో మరికొంత మందిస్టార్స్ మెడిసిన్ పూర్తి చేసినవారు ఉన్నారు.. మధ్యలోనే ఆపి మూవీ కెరీన్ ను చూసుకన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో సాప్ట్ వేర్ ఇంజ‌నీర్స్ జాబ్ ని వ‌దిలేసి సినిమాల్లోకి వ‌చ్చే వారి సంఖ్య పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement