Thursday, May 2, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ర‌ష్యా- ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య ఉద్రిక‌త్త‌ల నడుమ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల బాట ప‌డ్డాయి. నేడు ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 68పాయింట్లు న‌ష్ట‌పోయింది. దాంతో 57,232కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 17,063 వద్ద స్థిరపడింది.
కొటక్ మహీంద్రా బ్యాంక్ (2.49%), టైటాన్ (1.88%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.04%), మారుతి (0.87%), భారతి ఎయిర్ టెల్ (0.62%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఎన్టీపీసీ (-1.55%), ఎల్ అండ్ టీ (-1.13%), నెస్లే ఇండియా (-0.93%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.89%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.67%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement