Monday, April 29, 2024

లాభాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి.. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడినప్పటికీ… చివరకు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 54,768కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 16,341 వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంక్ (2.35%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.89%), టాటా స్టీల్ (1.65%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.63%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి. నెస్లే ఇండియా (-1.37%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.14%), సన్ ఫార్మా (-0.83%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.65%), డాక్టర్ రెడ్డీస్ (-0.38%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement