Monday, May 6, 2024

క్యాస్టింగ్ కౌచ్ పై స్టార్ హీరోయిన్ అనుష్క కీల‌క వ్యాఖ్య‌లు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని తెలిపింది. హీరో న‌వీన్ పోలిశెట్టి హీరోగా తెర‌కెక్కుతోన్న మూవీల న‌టిస్తోంది..ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అనుష్క క్యాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అవకాశాలు ఆశచూపి అమ్మాయిలను లొంగదీసుకునే విష సంస్కృతి టాలీవుడ్ లో కూడా ఉంది. కెరీర్ బిగినింగ్ లో నేను కూడా చూశాను. అయితే నేను ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉంటాను. కరెక్ట్ గా మాట్లాడతాను, కాబట్టి ఈ ఇబ్బందులు నాకు ఎదురు కాలేదు. నా మనస్తత్వం తెలిసి, నా దగ్గరకు ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు. ఒక్క చిత్ర పరిశ్రమలోనే కాదు, చాలా రంగాల్లో అమ్మాయిలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు.

క్యాస్టింగ్ కౌచ్ పై అనుష్క చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. ఎవరు కాదన్నా ఔనన్నా క్యాస్టింగ్ కౌచ్ దశాబ్దాలుగా పరిశ్రమలో పాతుకుపోయిన సమస్య. సోషల్ మీడియా ప్రభావం, ఆడవాళ్లు బయటికొచ్చి మాట్లాడే ధైర్యం చేయడం వలన ఈ క్యాస్టింగ్ కౌచ్ బాగోతాలు బయటికి వస్తున్నాయి. చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి వేధింపులకు గురైనవారే. ఓ స్థాయి గుర్తింపు వచ్చే వరకు ఇలాంటి వేధింపులు ఎదుర్కోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ వేధింపులకు బలైన వర్థమాన నటీమణులు ఎందరో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement