Friday, May 17, 2024

ఓటీటీలో బిగ్ బాస్ – అదిరిపోయిన‌ ప్రోమో

కొత్త‌గా బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్ టెలికాస్ట్ కానుంది. ఇప్ప‌టికే ఈసారి 24/7 ఈ షో హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. ఇందులో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, నాగార్జున కలిసి నటించారు. ఫన్నీగా ప్రోమోను డిజైన్ చేశారు. చివర్లో నాగార్జున..నో కామా, నో ఫుల్ స్టాప్, ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్ అంటూ డైలాగ్ చెప్పారు. అంటే రోజు మొత్తం హాట్ స్టార్ లో బిగ్ బాస్ టెలికాస్ట్ అవుతూనే ఉంటుందన్నమాట. మరీ అన్ని గంటలంటే జనాలు చూస్తారో లేదో..ఇక ఫిబ్రవరి 26 నుంచి షో మొదలుకానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇక ఈ షోలో ఒకప్పటి కంటెస్టెంట్స్ కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు టీవీలో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్ల నుంచి కొందరు కంటెస్టెంట్స్ ను ఓటీటీ వెర్షన్ కోసం తీసుకున్నార‌ట‌.

https://www.youtube.com/watch?v=QzcOrRNHZJE&t=96s
Advertisement

తాజా వార్తలు

Advertisement