Saturday, May 4, 2024

‘షేన్ వార్న్’ మృతి కేసులో ఊహించ‌ని ట్విస్ట్

థాయ్ లాండ్ లోని త‌న విల్లాలో స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ఈ నెల 4వ తేదీన మ‌ర‌ణించారు. కాగా ఆయ‌న‌ది స‌హ‌జ‌మ‌ర‌ణమేన‌ని..గుండెపోటుతో మ‌ర‌ణించార‌ని అటాప్సీ రిపోర్టు తెలిపింది. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియో పలు అనుమానాలకు తెరతీస్తోంది. వార్న్ చనిపోవడానికి నాలుగు గంటలకు ముందు మసాజ్ చేసే నలుగురు అమ్మాయిలు ఆయన విల్లాలోకి వెళ్లారు. యువతులు లోపలకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వార్న్ బతికుండగా ఆయనను చివరిసారిగా చూసింది ఈ నలుగురు అమ్మాయిలేనని పోలీసులు సైతం నిర్ధారించారు. పోలీసులు చెపుతున్న వివరాల ప్రకారం వార్న్ చనిపోయన రోజున మధ్యాహ్నం 1.53 గంటలకు మసాజ్ చేసే నలుగురు అమ్మాయిలను పిలిపించుకున్నారు. వీరిలో ఇద్దరు వార్న్ ఉన్న గదిలోకి వెళ్లగా… మిగిలిన ఇద్దరూ వార్న్ స్నేహితుల గదుల్లోకి వెళ్లారు. వార్న్ తో ఇద్దరు అమ్మాయిలు దాదాపు గంటకు పైగా గడిపి 2.58 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మధ్యాహ్నం భోజనానికి వస్తానన్న వార్న్ ఎంత సేపటికీ రాకపోవడంతో.. సాయంత్రం 5.15 గంటలకు వార్న్ గదికి ఆయన స్నేహితులు వెళ్లారు. అప్పటికే వార్న్ బెడ్ పై విగతజీవిగా పడి ఉన్నారు. అయితే స్నేహితులు సీపీఆర్ చేస్తుండగా రక్తం కక్కుకున్నారని పోలీసులు తెలిపారు. వార్న్ అంతకు ముందు నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెందారని తెలిపారు. మరోవైపు మసాజ్ చేసేందుకు వచ్చిన నలుగురు అమ్మాయిలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement