Thursday, May 2, 2024

ఇప్ప‌టికే 129మంది పిల్ల‌ల‌కు తండ్రి – ఇంకా కావాల‌ట‌

ప్ర‌స్తుతం ఒక్కరు లేదా ఇద్ద‌రు మ‌రీ కాదు కూడ‌దు అంటే న‌లుగురు పిల్ల‌ల్ని కంటున్నారు. అయితే ఇక్క‌డ ఓ వ్య‌క్తి ఏకంగా 150మంది పిల్ల‌లు కావాలంటున్నాడు. విన‌డానికి విడ్డూరంగా ఉందా.. ప్ర‌స్తుతం 129పిల్ల‌ల‌కు తండ్రి కూడా అయ్యాడా వ్య‌క్తి. ఇంత‌మంది పిల్ల‌ల‌ని క‌న‌డం ఎలా సాధ్యం అనుకుంటున్నారా వీర్యదానం వ‌ల్ల ఇది సాధ్య‌మ‌యింది. పాశ్చాత్య దేశాల్లో వీర్యదానం సంస్కృతి కొత్తేమీ కాదు. అందుకు అక్కడి చట్టాలు కూడా అనుమతిస్తాయి. యూకేకు చెందిన క్లైవ్ జోన్స్ (66 సంవత్సరాలు) sperm donorగా మారడం ద్వారా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో తొమ్మిదిమంది త్వరలో పుట్టబోతున్నారు. తనకు 58 సంవత్సరాలు వచ్చినప్పటినుంచి వీర్యం దానం చేస్తున్నాడ‌ట‌. sperm donate చేయడానికి డబ్బులు కూడా తీసుకోవడం లేదని తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచంలో తానే ఎక్కువ మందికి వీర్యదానం చేసిన వ్యక్తిన‌ని చెప్పాడు.

మరి కొన్నేళ్లపాటు వీర్య దానం చేస్తానని, 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్య దానం చేయనని క్లైవ్ వెల్ల‌డించాడు. అయితే, క్లైవ్ అధికారికంగా స్పెర్మ్ డోనర్ కాదు. బ్రిటన్ లో స్పెర్మ్ డోనర్ గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. ఈ కారణంగా face book ద్వారా కస్టమర్లతో కనెక్ట్ అయి ఉచితంగా వీర్య దానం చేస్తున్నాడు. బ్రిటన్ లో చాలా క్లినిక్ లు వీర్యాన్ని అమ్ముతున్నట్లు తెలిపారు. ఒకరికి ఆనందాన్ని ఇవ్వడం, వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను సంతోషపడుతున్నానని క్లైవ్ తెలిపాడు. 10 సంవత్సరాల క్రితం వార్తా పత్రికలో వచ్చిన ఒక కథనాన్ని చదివిన తర్వాత పిల్లలు లేని వ్యక్తులు ఎంత మానసిక వేదనను అనుభవిస్తారో తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నాన‌ని చెప్పాడు. యూకే హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ క్లైవ్ కు హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా బ్రిటన్ లో స్మెర్మ్ డొనేషన్ కొనుగోలు చేయడం లైసెన్స్ పొందిన క్లినిక్ ల ద్వారా మాత్రమే చేయాలి. క్లైవ్ వీటిని పాటించకపోవడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement