Monday, April 29, 2024

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వర్కింగ్ స్టీమ్ రైలు-హెరిటేజ్ రన్‌

ఇండియ‌న్ రైల్వే 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని EIR-21 అని పిలువబడే 167 ఏళ్ల నాటి లోకోమోటివ్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన స్టీమ్ ఇంజిన్‌ను హెరిటేజ్ రన్‌గా నిర్వహించనుంది. EIR-21 ద్వారా హెరిటేజ్ స్పెషల్ సర్వీస్ చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం రైల్వే స్టేషన్‌ల మధ్య ఆగస్టు 15న మధ్యాహ్నం 2.30 గంటలకు నడుస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఎక్స్‌ప్రెస్ EIR 21 లోకోమోటివ్ 1855లో ఇంగ్లండ్ నుండి భారతదేశానికి రవాణా చేయబడింది. 1909లో ఈ లోకోమోటివ్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఆ తరువాత ఇది బీహార్‌లోని జమాల్‌పూర్ వర్క్‌షాప్‌లో 101 సంవత్సరాలకు పైగా ప్రదర్శనగా ఉంచారు.

15-08-2022న స్పెషల్ హెరిటేజ్ రన్ సందర్భంగా EIR-21 కోసం ట్రయల్ రన్ నిర్వహించినప్పుడు అపురూప దృశ్యం ఆవిష్కృతమయ్యింది. ఆ ట్రైన్ విజిల్ అందమైన శబ్ధం మిమ్మల్ని ఆవిరి లోకోమోటివ్ కాలానికి వెళ్లిపోయేలా చేస్తుంది అని DRM చెన్నై ఒక ట్వీట్‌ లో వీడియోను షేర్ చేశారు. పెరంబూర్ లోకో వర్క్స్ 2010లో ఇంజిన్‌ను పునరుద్ధరించింది. ఈ ట్రైన్ గరిష్టంగా 45 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ లోకోమోటివ్ లో ట్విన్ ఎయిర్ బ్రేక్ సౌకర్యాలతో పాటు మెకానికల్ హ్యాండ్ బ్రేక్‌ లు ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్, వాటర్ పంప్, రైలు లైటింగ్‌ల కోసం డీజిల్ జనరేటర్ సెట్‌ను కోచ్‌పై అమర్చారు. మొదటి హెరిటేజ్ రన్ ఆగష్టు 15, 2010న చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి అవడి వరకు రెండు కోచ్‌లతో నిర్వహించారు. ఎనిమిదో హెరిటేజ్ రన్ ఆగస్టు 15, 2019న చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం రైల్వే స్టేషన్‌ల మధ్య ఒక కోచ్‌తో నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement