Thursday, May 9, 2024

మోగాలో వెనుకంజ‌లో ఉన్న న‌టుడు సోనూసూద్ సోద‌రి – మాళ‌విక సూద్

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో దూసుకుపోతోంది..కాగా కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కూడా వెనకంజలో ఉన్నారు. మోగా స్థానం నుంచి బరిలో నిలిచిన మాళవిక తన ప్రత్యర్థి కంటే వెనకంజలో ఉన్నారు. గత 40 ఏళ్లుగా మోగా స్థానంలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం. 1977 నుంచి 2017 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఆరుసార్లు విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో హర్జోత్ సింగ్ ఇక్కడి నుంచి గెలిచారు. ఇక, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కొనసాగిస్తుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. ఆప్ భారీ మెజారిటీ వైపుగా దూసుకుపోతుంది. మూడింట రెండో వంతు స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి పంజాబ్‌లో ఆప్‌ సత్తా చాటుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో.. ఆప్ 79 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 16 స్థానాల మాత్రమే ముందజలో ఉంది. చాలాచోట్ల అధికారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆప్ గట్టి షాక్ ఇస్తుంది. కాంగ్రెస్‌తో పాటు, ఇతర పార్టీలకు చెందిన పలువురు హేమాహేమీలను వెనక్కి నెడుతూ ఆప్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పంజాబ్‌లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉండగా.. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement