Tuesday, May 21, 2024

నీర‌జ్ చోప్రా -డౌన్ టు ఎర్త్ – వైర‌ల్ గా వీడియో

త‌న ఫ్యాన్స్ కి ఎంతో గౌర‌వమిస్తాడు నీర‌జ్ చోప్రా..ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకారం అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉన్నాడు. చోప్రా భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. ఆట‌తోనేకాదు త‌న స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తోనూ ఫ్యాన్స్ మ‌న‌సు దోచుకుంటున్నాడు. ఓ వీడియోను ‘యువ‌ర్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో నీరజ్ చోప్రా తన అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నాడు. చాలా మర్యాదపూర్వకంగా అంద‌రికీ ధన్యవాదాలు అని చెప్పాడు. దీని తర్వాత అత‌డు అక్క‌డున్న‌వారితో కరచాలనం చేశాడు. చివ‌ర‌గా ఓ వృద్ధుడు క‌నిపించ‌గానే అత‌డి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వీడియోను 47వేల మంది వీక్షించారు. నీర‌జ్ చోప్రా.. డౌన్ టు ఎర్త్ వ్య‌క్తి అని నెటిజ‌న్లు కొనియాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement