Sunday, May 5, 2024

స‌ల్మాన్ కి పాముకాటు – ప్రాణ హాని లేద‌న్న డాక్ట‌ర్స్

మ‌హారాష్ట్ర‌లోని ప‌న్వేల్ లోని ఫామ్ హౌస్ లో బాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్ కు పాము కాటేసిందని స‌మాచారం. విషంలేని పాము స‌ల్మాన్ ని కాటు వేసింది.దాంతో స‌ల్మాన్ ని ఆసుప‌త్రిలో జాయిన్ చేశారు. ఆయ‌న ప్రాణాల‌కు ఎలాంటి హాని లేద‌ని డాక్ట‌ర్స్ తెలిపారు. పాము కాటు తర్వాత.. సల్మాన్ ఖాన్ ను నేరుగా నవీ ముంబై కమోతే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు . ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఎవరు ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement