Saturday, April 27, 2024

షూటింగ్ సెట్ లో నిద్ర‌పోయిన – పాయ‌ల్ రాజ్ పుత్

ఇషాన్ సూర్య ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో న‌టిస్తోంది హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్. నెట్టింట్లో ఏదో ఒక అప్ డేట్‌ను అభిమానులు.. ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకునే పాయ‌ల్ ఈ సారి ఓ ఫ‌న్నీ స‌ర‌దా స్టిల్‌ను అంద‌రితో పంచుకుంది. షూటింగ్ లొకేష‌న్‌లో స‌ర‌దాగా మంచు విష్ణు ప‌క్క‌నే నిద్ర‌పోయిన‌ట్టుగా కెమెరాకు ఫోజు ఇచ్చింది. ఈ స్టిల్‌కు ఉదయపు షూట్స్ ఇలా ఉంటాయి…హుహ్ నేను కండ్లు తెరవలేదు..ఎందుకంటే సగం నిద్రలో.. భయంకరంగా ఉన్నానంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. లంగావోణిలో పాయ‌ల్ రాజ్‌పుత్‌, స్టైలిష్ గాగుల్స్ లో విష్ణు, ఆ ప‌క్క‌నే ఓ క‌మెడియ‌న్ కూడా ఫొటోలో చూడొచ్చు. ఇపుడీ ఫొటో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఏవీఏ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కోన వెంక‌ట్ క‌థ‌నందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ స‌న్నీలియోన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement