గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగంబర్ కామత్ ఈరోజు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈరోజు వ్యక్తిగత పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన కామత్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై రేవంత్‌కు ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కామత్ రేవంత్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లడం, రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా విద్యావంతులు అధికంగా ఉండే గోవా లాంటి రాష్ట్రానికి సీఎంగా కామత్ వ్యవహరించిన విషయం విదితమే.
రేవంత్ రెడ్డితో గోవా మాజీ సీఎం భేటీ

Previous articleసీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు
Next articleషూటింగ్ సెట్ లో నిద్రపోయిన – పాయల్ రాజ్ పుత్
Advertisement
తాజా వార్తలు
Advertisement