Wednesday, May 1, 2024

Breaking: బీఆర్​ఎస్​గా పార్టీ పేరు మారుస్తూ తీర్మానం.. ప్రవేశపెట్టిన ఆరుగురు ఎమ్మెల్యేలు..

తెలంగాణ భవన్​లో టీర్​ఎస్​ జనరల్​ బాడీ మీటింగ్​ జరుగుతోంది. టీఆర్​ఎస్​ పార్టీ పేరును మారుస్తూ ఆరుగురు ఎమ్మెల్యేలు.. అంటే సామాజిక వర్గాల వారీగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎమ్మెల్యలతో పాటు మరో మహిళ ఎమ్మెల్యే కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో టీఆర్​ఎస్​ పార్టీని బీఆర్​ఎస్​గా ఎందుకు మార్చాల్సి వస్తోంది. పార్టి విస్తరణకు సంబంధించిన వివరాలను చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పలు రాష్ట్రాల నేతలు బీఆర్​ఎస్​లో విలీన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం కుమారస్వామి కూడా మాట్లాడనున్నారు.

ఇక.. తెలంగాణ భవన్​ ఎదట పెద్ద ఎత్తున క్రౌడ్​ ఉంది. కార్యకర్తలు, అభిమానులు జెండాలతో సందడి చేస్తున్నారు. సీఎం కేసీఆర్​ 1.19 నిమిషాలకు పార్టీ ప్రకటన చేయగానే పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సంబురాలు చేసేందుకు రెడీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement