Wednesday, May 1, 2024

ల‌తా మంగేష్కర్ కి ఇంకా ‘ఐసీయూ’లోనే చికిత్స‌

ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ కి క‌రోనా పాజిటీవ్ నిర్థార‌ణ కావ‌డంతో వారం రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్ప‌ట‌ల్ లో జాయిన్ చేశారు. అప్ప‌టి నుంచి ఐసీయూలోనే లతామంగేష్కర్ కి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మొదట ఆమె ఆరోగ్య పరిస్థితి మంచిగానే ఉందంటూ కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం ఇచ్చారు. వైద్యులు సైతం ఆందోళన అక్కర్లేదన్నట్టే సంకేతం ఇచ్చారు. వారం రోజులు గడిచినా కానీ, ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేయకపోవడంతో ఇంకా కోలుకోవాల‌ని చెప్పారు.

లతా మంగేష్కర్ కోలుకోవాలని అభిమానులు దేవుడిని వేడుకోవాలంటూ ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రతీత్ సందాని తాజాగా పిలుపునిచ్చారు. ‘‘ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోనే ఆమె ఉన్నారు. మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఏం చెప్పినా కానీ అది తొందరపాటే అవుతుంది. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఆమె ఆసుపత్రిలోనే మరో 10 రోజుల పాటు ఉండాల్సి వస్తుంద‌న్నారు. లతా మంగేష్కర్ సోదరి ఆశాభోంస్లే సైతం స్పందించారు. కరోనా పాజిటివ్ కావడంతో సోదరిని చూసేందుకు అనుమతించడం లేదని తెలిపారు. ‘‘ఒక్కసారి నేను ఆసుపత్రికి వెళ్లినా కానీ కాంపౌండ్ లోకి అనుమతించలేదు. కానీ దీదీ పరిస్థితి మెరుగుపడుతోంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement