Thursday, April 25, 2024

సిద్దూ..భజ్జీ భేటీ?

చండీగఢ్-పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరో బాంబు పేల్చారు. భారత స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ తో కలసి ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసి.. ఉత్కంఠ రేపే వ్యాఖ్య ట్వీట్ చేశారు. ఎన్నో అవకాశాలతో… అన్న వ్యాఖ్యతో ఆ ఫోటోను జతచేశారు.

ఇది పంజాబ్ రాజకీయాలలో సంచలనంగా మారింది. భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఇటీవలే హర్భజన్ సింగ్ ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్దూ భజ్జీతో కలసి ఉన్న ఫోటోను ట్వీట్టర్ లో పోస్టు చేయడం ఆసక్తి కలిగిస్తోంది. భజ్జీ కాంగ్రెస్ లో చేరబోతున్నారా అన్న ఉత్కంఠ మొదలైంది. పైగా ఎన్నో అవకాశాలు.. ఏదైనా జరగొచ్చన్న వ్యాఖ్యకు తోడుగా ఉదయిస్తున్న సూర్యుడంటూ కితాబిస్తూ మరో వ్యాఖ్య జోడించడంలో సిద్ధూ లౌక్యం కనిపిస్తోంది. భారత్ క్రికెట్ లో ఒక వెలుగు వెలిగిన యువరాజ్ సింగ్, భజ్జీలను చేర్చుకునే దిశలో బీజేపీ పావులు కదుపుతోందన్న నేపథ్యంలో సిద్దూ ఈ బాంబు పేల్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement