Friday, March 29, 2024

భారత్-యుఎస్ మైత్రికి రష్యా అడ్డంకి కాబోదు

వాషింగ్టన్-భారత, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని, ప్రత్యేకించి రక్షణరంగంలో వాణిజ్య బంధం మరింత ఉన్నత స్థితికి చేరబోతోందని భారత్ లో అమెరికా రాయబారిగా రానున్న ఎరిక్ మైఖేల్ గార్సెటీ చెప్పారు. అత్యాధునిక ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం అమెరికాతో సంబంధాలపై ఉండదని ఎరిక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లాస్ ఏంజిలిస్ మేయర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎరిక్, భారత్లో అమెరికా రాయబారిగా నియమించేందుకు బిడెన్ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఎరిక్ ధ్రువీకరించారు. బిడెన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న ఎరిక్ భారత్ కు రాయబారిగా నియమించనున్న నేపథ్యంలో ఆయన కీలక అంశాలపై స్పందించారు. అమెరికా నుంచి 20 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ సామగ్రి, ఆయుధాలను భారత్ కొనుగోలు చేసిందని, అమెరికాతో నాలుగు కీలక రక్షణ ఒప్పందాలు చేసుకున్న భారత్ అతిపెద్ద రక్షణ భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. అయితే, అమెరికా రక్షణ పరికరాలు, ఆయుధ వ్యవస్థకు సంబంధించిన డేటా, ప్రత్యేకతల పరిరక్షణకు కట్టుబడ్డామని, అందువల్ల కాప్సావంటి చట్టాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని, అయితే భారత్ విషయంలో ఆ చట్టం అమలు విషయమై ఇప్పుడే తానేమీ వ్యాఖ్యానించలేనని స్పష్టం చేశారు. రక్షణపరంగా నౌకావిన్యాలు, సముద్రరక్షణ, ఆయుధాల విక్రయం, ద్వైపాక్షిక, బహుపాక్షిక యుద్ధ విన్యాసాలతో భారత్ తో ఎన్నడూలేని రీతిలో బంధం బలోపేతమైన నేపథ్యంలో రష్యానుంచి క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడాన్ని ఆమెరికాకు నచ్చడం లేదు. భారత్ పై కూడా కాప్సా చట్టం మేరకు ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement