Tuesday, April 30, 2024

Hyderabad | కూల్​ డ్రింక్​ దొంగిలించిన బాలుడు.. ప్రైవేట్​ పార్ట్స్​పై కారం చల్లి వీడియో తీసిన ఓనర్​!

హైదరాబాద్‌లోని నాంపల్లిలో దారుణం జరిగింది. ఓ షాపులో కూల్​ డ్రింక్​ బాటిల్​ దొంగిలిస్తూ బాలుడు ఆ షాపు ఓనర్​కి దొరికిపోయాడు. దీంతో ఆ బాలుడి బట్టలు విప్పి చితకబాదాడు. అక్కడితో ఆగకుండా ఆ షాపు యజమాని బాలుడి ప్రైవేట్ భాగాలపై కారం పొడి చల్లాడు.

అంతేకాకుండా ఆ నొప్పి భరించలేక ఏడుస్తూ.. కారంపొడిని కడుక్కునేందుకు నీళ్లు అడుగుతున్న ఆ బాలుడిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. తల్లిదండ్రులు ఈ వీడియో చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దుకాణం యజమానిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement