Saturday, April 27, 2024

స్మార్ట్ ఫోన్ల‌లో శాటిలైట్ ఎనేబుల్ ఫీచ‌ర్‌.. సెల్ ట‌వ‌ర్స్ లేకున్నా సిగ్న‌ల్‌!

సిగ్నల్ టవర్లతో పనిలేకుండా నేరుగా శాటిలైట్ల నుంచే మొబైల్ ఫోన్లు సిగ్నల్ ను అందుకునే ఫెసిలిటీ ముందు ముందు రాబోతోంది. త్వరలోనే ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ తీసుకురానున్నట్టు టెక్ దిగ్గ‌జం గూగుల్ వెల్లడించింది. బహుశా ఆండ్రాయిడ్ 14లో ఈ అత్యాధునిక ఫీచర్ అందుబాటులోకి వస్తుందని అంతా భావిస్తున్నారు. దీనిపై ఆండ్రాయిడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు హిరోషి లోషిమెర్ స్పందించారు. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకుంటే నెట్వర్క్ అందుబాటులో లేకపోయినా, నేరుగా శాటిలైట్ తో అనుసంధానమై ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఎస్సెమ్మెస్ లు పంపుకోవచ్చు. కాగా, ఐఫోన్-14 మోడల్స్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్ నుంచి ఎట్లాంటి స్పష్టత లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement