Tuesday, April 30, 2024

మ‌హేశ్ బాబు గ్లామ‌ర్ సీక్రెట్ ఇదే – రామ్ లక్ష్మ‌ణ్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ గానే కాదు..అంద‌గాడుగా అమ్మాయిల రాకుమారుడిగా మారారు మ‌హేశ్ బాబు. ఆయ‌న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌లో ఆయ‌న మ‌రింత యంగ్ గా క‌నిపిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా పని చేసిన రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ తాజాగా..మహేశ్ గ్లామ‌ర్ సీక్రెట్ రివీల్ చేశారు.. తాము మహేశ్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం కూడా పని చేశామని, ఆ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్లామని గుర్తు చేసుకున్నారు. అక్కడ విపరీతమైన చలి ఉన్నప్పటికీ మహేశ్ బాబు పొద్దున్నే లేచి వ్యాయామం చేసేవాడని చెప్పారు. డే మొత్తం షూట్ చేసినప్పటికీ ఈవినింగ్ టైమ్స్ లో మహేశ్ వ్యాయామం చేసేవారని మాస్టర్స్ చెప్పారు. మహేశ్..ఎట్టి పరస్థితుల్లోనూ వ్యాయామం స్కిప్ చేయబోడని, అందుకే ఆయన చాలా హ్యాండ్సమ్ గా, గ్లామర్ గా కనిపిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement