Monday, May 6, 2024

కోహ్లీ ఇచ్చిన గిఫ్ట్ ని తిరిగి ఇచ్చేశా – స‌చిన్ టెండూల్క‌ర్

క్రికెట్ గాడ్ స‌చిన్ టెండుల్కర్ 2013లో అంత‌ర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. సాధార‌ణ జ‌నంతో పాటు, క్రికెటర్లలోనూ ఎంతో మంది సచిన్ ను ఎంతో ఇష్టపడుతుంటారు. అటువంటి వారిలో విరాట్ కోహ్లీ కూడా ఒకడు. అప్పుడు కోహ్లీ కెరీర్ ఆరంభంలో ఉన్నాడు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి బాధను ఆపుకోలేకపోతున్న సందర్భంలో కోహ్లీ ఒక చిన్న కానుక ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నాడు.నేను ఒంటరిగా ఒక మూలన కూర్చున్నాను. నా తలపై టవల్ ఉంది. కంటి వెంట వస్తున్న నీళ్లను తుడుచుకుంటున్నాను. ఆ సమయంలో విరాట్ నా దగ్గరకు వచ్చాడు. ఒక పవిత్ర దారాన్ని నాకు ఇచ్చాడు. అది అతడికి వాళ్ల నాన్న ఇచ్చింది’’ అని సచిన్ వివరించాడు.

కోహ్లీ ఆ తాడును సచిన్ కు ఇస్తూ.. సాధారణంగా చేతి మణికట్టుకు మనం ఏదో ఒకటి ధరిస్తుంటాం. భారత్ లో చాలా మంది ఇలానే చేస్తారు. మా నాన్న నాకు కూడా ఒకటి ఇచ్చారు. దానిని నా బ్యాగ్ లోనే ఉంచేసుకున్నాను. నా దగ్గరున్న విలువైనది అదేనన్నది నా అభిప్రాయం. మా నాన్న నాకు ఇచ్చినది. కనుక అంతకంటే విలువైనది నేను మీకు ఏదీ ఇవ్వలేను. మీరు నాకు ఎంత స్ఫూర్తినిచ్చారో తెలియజేయాలనుకుంటున్నాను. ఇది నేను ఇచ్చే చిన్న కానుకని కోహ్లీ ఆ సందర్భంలో సచిన్ కు చెప్పాడట.దానిని నా దగ్గరే కొద్ది సేపు ఉంచుకుని విరాట్ కు తిరిగి ఇచ్చేశాను. ‘ఇది అమూల్యమైనది. ఇది నీ దగ్గరే ఉండాలి. ఇంకెవరి దగ్గరా కాదు. ఇది నీ ఆస్తి. నీ చివరి శ్వాస వరకు నీ దగ్గరే ఉండాలి’ అని చెబుతూ వెనక్కిచ్చేశాను. అది నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేసిన సందర్భం. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంద‌ని అమెరికన్ జర్నలిస్ట్ గ్రాహమ్ బెన్సింగర్ కి స‌చిన్ వెల్ల‌డించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement