Friday, April 26, 2024

నువ్వుల ల‌డ్డూ చేసిన స‌చిన్.. వైర‌ల్ అవుతోన్న వీడియో

క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ నువ్వుల ల‌డ్డూని త‌న‌దైన స్టైల్లో త‌యారు చేశారు.ఈ మేర‌కు ల‌డ్డూ చేసిన వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.ఈ రెసిపీకి ఏం ఏం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేయాలో స్టెప్‌ బై స్టెప్‌ వివరించారు. ఈ లడ్డూలను మొదటి సారి తయారు చేస్తున్నా’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. సచిన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. సచిన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సచిన్‌ మంచి ఆహార ప్రియుడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ చూస్తేనే తెలుస్తుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చెఫ్‌ అవతారం ఎత్తి.. రకరకాల వంటకాలను ట్రై చేస్తుంటారు. ప్రత్యేకమైన సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం మంచి మంచి డిషెస్‌ తయారు చేసి పెడుతుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement