Sunday, May 19, 2024

రామసేతుపై ‘ఎస్’​ అంటే నేను గెలిచినట్టు, ‘నో’ అంటే ఆయన ఓడినట్టు.. మోదీని టార్గెట్​ చేసిన స్వామి!

రామసేతు చారిత్రక పురాతన వారసత్వ కట్టడమా? కాదా అన్న అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవ్వాల (సోమవారం) సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే.. దీనిపై కేసు దాఖలు చేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని మోదీని టార్గెట్​ చేస్తూ ట్వీట్​ చేయడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. రామసేతుపై ప్రధాని మోదీ ఎస్​ అంటే తాను గెలిచినట్టు అని, నో అంటే 2024 ఎన్నికల్లో మోదీ ఓడిపోయినట్టు అని సెటైర్​ వేస్తూ ట్వీట్​ చేశారు.

– డిజిటల్​ మీడియా, ఆంధప్రభ

సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి.. ఈ పేరు దేశంలోని ప్ర‌ముఖుల‌కు, పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆయ‌న లిటిగేష‌న్ మాస్ట‌ర్‌గా ఎంతో పేరుగాంచారు. ఆయ‌న క‌నుక కేసు టేకాఫ్ చేస్తే దాని వెన‌క ఉన్న వ్య‌క్తులు కంప‌ల్స‌రీ జైలుకు వెళ్లాల్సిందే. అయితే.. ప్ర‌స్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌భ్యుడిగా, ఆ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి. ఈ మ‌ధ్య కాలంలో నేరుగా ఆయ‌న‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవ్వాల (సోమ‌వారం) రామ‌సేతు అంశాన్ని ఆధారం చేసుకుని స్వామి మ‌రోమారు మోదీపై సెటైర్ సంధించారు.

రామ‌సేతు వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు ప‌రిధిలో ఉంది. ఈ వ్య‌వ‌హారంపై సోమ‌వారం సుప్రీంకోర్టు విచార‌ణ కూడా చేప‌ట్టింది. విచార‌ణ‌లో భాగంగా రామ‌సేతు నిర్మాణం పురాత‌న వార‌స‌త్వ క‌ట్ట‌డ‌మో?, కాదో? తేల్చి చెప్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అవునంటే అవున‌నండి, కాదంటే కాద‌ని చెప్పండి… ఏదో ఒక మాట అయితే మాత్రం క‌చ్చితంగా చెప్పాల్సిందేన‌ని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తూ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కోరింది.

ఇక‌.. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి… ఈ వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు విచార‌ణ తుది ద‌శ‌కు వ‌చ్చిన‌ట్టేనని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌తో ఇప్పుడు రామ‌సేతుపై కేంద్రం నోరు విప్ప‌క త‌ప్ప‌ని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. రామ‌సేతు పురాత‌న వార‌స‌త్వ క‌ట్ట‌డ‌మే అని ఒప్పుకుంటే ‘ఎస్’ అని కేంద్రం చెబితే… తాను విజ‌యం సాధించిన‌ట్టేన‌ని స్వామి తెలిపారు. అలా కాకుండా రామసేతు పురాత‌న వార‌స‌త్వ క‌ట్టడం కాద‌ని అంటే ‘నో’ అని కేంద్రం చెబితే… అది 2024లో మోదీ ఓట‌మికి దారి తీస్తుందంటూ స్వామి జోస్యం చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement