Sunday, May 5, 2024

పుతిన్ త‌లపై రూ.7.5కోట్లు రివార్డు ప్ర‌క‌టించిన ర‌ష్యా కుబేరుడు

గ‌త వారం రోజులుగా ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే ఈ దాడుల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. పొరుగుదేశం ఉక్రెయిన్ పై దురాక్రమణ జరుపుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్ప‌డుతోంది. స్వదేశంలోనూ పుతిన్ నిరసన సెగలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా, రష్యా కుబేరుడు ఒకరు పుతిన్ తలపై రివార్డు ప్రకించారు. రాజకీయ ఒత్తిళ్లతో రష్యాను విడిచిపెట్టి అమెరికాలో ఉంటున్న అలెక్స్ కొనానిఖిన్ ఓ సంపన్నుడు. అనేక రాజకీయపరమైన కారణాలతో కొనానిఖిన్ 1992లో రష్యాను వీడి అమెరికా చేరుకున్నారు. అక్కడే అనేక స్టార్టప్ లలో పెట్టుబడులు, క్రిప్టో వ్యాపారాలతో తన సంపదను వేల కోట్లకు పెంచుకున్నారు. అయితే, పుతిన్ అనుసరిస్తున్న విధానాలు కొనానిఖిన్ కు కోపం తెప్పించాయి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ ఆగ్రహం మరింత పెరిగింది. అందుకే, పుతిన్ ను సజీవంగా బంధించినా, చంపేసినా భారీ మొత్తంలో నజరానా అందిస్తానని కొనానిఖిన్ ఓ ప్రకటన చేశాడు. పుతిన్ ను ప్రాణాలతో అరెస్ట్ చేసిన వారికి, లేదా చంపేసినా సరే… వారికి రూ.7.5 కోట్లు ఇస్తానని వెల్లడించారు. పుతిన్ ప్రజాస్వామ్యయుత ఎన్నికలు లేకుండా చేసి, జీవితకాలం పాటు తానే రష్యా అధ్యక్షుడిగా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నాడని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement