Sunday, May 5, 2024

నాలుగేళ్ల ఉపవాసం ఉన్న పులిలా తార‌క్ – వైర‌ల్ గా మీమ్స్

ఈ నెల 25న ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మీమ్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలోనూ ఈ సినిమా ప‌లు సార్లు వాయిదా ప‌డిన నేప‌థ్యంలో అప్ప‌ట్లోనూ మీమ్స్ బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సృష్టించ‌నున్న రికార్డుల‌పైనే అంద‌రి అంచ‌నా ఉంది. ఈ విష‌యంపైనే నెటిజన్లు మ‌రోసారి త‌మ ప్ర‌తిభ‌కు సాన‌పెడుతూ మీమ్స్ సృష్టిస్తున్నారు. ఈ సినిమాలోని ”నక్కి నక్కి గాదే.. తొక్కుకుంటూ పోవాలే… ఎదురొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలే” అన్న డైలాగుతో మీమ్స్ అధికంగా వ‌స్తున్నాయి. #ThokkukuntuPovaale, #ManOfMassesNTR హ్యాష్ ట్యాగ్‌ల‌తో మీమ్స్ సృష్టిస్తున్నారు. నాలుగేళ్ల ఉపవాసం ఉన్న పులిలా తార‌క్ అన్న అభిమానులు ఉన్నారంటూ ఆయ‌న ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ”అనకాపల్లి నుండి అమెరికా వరకూ, కశ్మీర్ నుండి కన్యా కుమారి వరకూ బాక్సాఫీస్ ఊచకోత మొదలు ఇంకా” అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement