Monday, November 11, 2024

చైనీస్ థియేటర్ లో ఆర్ ఆర్ ఆర్.. నిమిషంన్నరలోనే 932 టికెట్ల విక్రయం

ఈ నెల 9న ఆర్ ఆర్ ఆర్ చిత్రం అమెరికాలోని లాజ్ ఏంజెలెస్ లో ఉన్న టీసీఎల్ చైనీస్ థియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రదర్శనకు బుకింగ్ లు కేవలం 98 సెకండ్లలోనే పూర్తయిపోయాయి. నిమిషంన్నరలోనే 932 టికెట్లు సేల్ అయ్యాయి. ఇంత వేగంగా టికెట్లు అమ్ముడు కావడం మరే భారతీయ సినిమా విషయంలోనూ సాధ్యం కాలేదు.ఈ షోకు దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హాజరు కానున్నారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్. గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డులకు ఆర్ఆర్ఆర్ రెండు నామినేషన్లలో ఎంపిక కావడం తెలిసిందే. ఈ నెల 11న జరిగే ఈ కార్యక్రమానికి సైతం రాజమౌళి, తారక్, రామ్ చరణ్ హాజరుకానున్నారు. దీనికంటే రెండు రోజుల ముందు ‘బియాండ్ ఫెస్ట్’లో భాగంగా ఆర్ఆర్ఆర్ ను చైనీస్ థియేటర్ లో ప్రదర్శించనున్నారు. బియాండ్ ఫెస్ట్ తన అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement