Wednesday, December 4, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అర‌కిలో బంగారం ప‌ట్టివేత..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వ‌హించారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన షేక్ అత్తార్ సమీర్ అల్తార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన షేక్ అత్తార్ సమీర్ అల్తార్ వద్ద అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బంగారం కాళ్ళకు వేసుకునే బూట్లలో దాచుకుని రావడంతో కస్టమ్స్ అధికారులు స్కానింగ్ చేసి గుర్తించారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.27,78,000లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితున్ని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement