Monday, April 29, 2024

ఆర్ ఆర్ ఆర్ కి హాలీవుడ్ అవార్డుల పంట‌.. సంబ‌రాలు చేసుకుంటోన్న ఫ్యాన్స్

ఆర్ ఆర్ ఆర్ సినిమాకి హాలీవుడ్ అవార్డులు వ‌చ్చి చేరుతున్నాయి.. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో తార‌క్ కొమురం భీమ్ పాత్రలో న‌టించగా, రామ్‌ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టించారు. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌ పోషించారు. డివివి దాన‌య్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన‌ ఈ చిత్రంలో అలియాభ‌ట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయిక‌లుగా న‌టించారు.తాజాగా మ‌రో హాలీవుడ్ అవార్డును ద‌క్కించుకుంది ఈ చిత్రం. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే HCA స్పాటిలైట్‌ అవార్డును ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం గెలుచుకుంది.

దీనితో పాటుగా అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌ ఈ ఏడాదికిగాను ఉత్తమ అంతర్జాతీయ సినిమా అవార్డుకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని ఎంపిక చేసింది. ఇలా వరుసగా ఆర్‌ఆర్‌ఆర్‌కు హాలీవుడ్ నుండి అవార్డులు రావడంతో టాలీవుడ్‌ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మ‌న దేశం బ‌రిలోకి నిలుస్తుంద‌ని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వెరైటీ మ్యాగజైన్‌ ప్రకారం.. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యే అవకాశం ఉంది. 95వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం 2023, మార్చి 12న జరగనుంది. దీనికోసం రాజమౌళి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఇండియా నుండి ఆర్‌ఆర్‌ఆర్‌కు అధికారిక ఎంట్రీగా ఉంటుందని భావించినా.. అది జరగలేదు. దీంతో నేరుగా జక్కన్న ఆస్కార్‌ ఎంట్రీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement