Tuesday, May 14, 2024

భార‌త్ లో ర‌హ‌దారులు అమెరికాలో మాదిరే ఉంటాయి-కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీ

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రోడ్ల‌ను అమెరికాలో ర‌హ‌దారుల కంటే గొప్ప‌గా నిర్మిస్తామ‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర ర‌వాణా..ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. 2024లోపే యూపీకి రూ.5 లక్షల కోట్ల రూపాయలను ప్ర‌ధాని మోడీ సర్కారు అందించనున్నట్టు తెలిపారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 81వ సెషన్ ను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా గడ్కరీ ఈ ప్రకటన చేశారు. యూపీలో రహదారులకు రూ.8,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు.ఈ ఏడాది ఆగస్ట్ లోనూ గడ్కరీ దేశంలోని రహదారులపై రాజ్యసభలో ఓ ప్రకటన చేయడం గుర్తు చేసుకోవాలి. భారత్ లో రహదారుల వసతులు అమెరికా మాదిరే ఉన్నట్టు చెప్పారు. నిధులకు కొరత లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, 2024లోపే భారత్ లోని రహదారులు అమెరికాలో మాదిరే ఉంటాయి. ఇది నా హామీ’’అని పేర్కొనడం గమనార్హం. యూపీలో కొనసాగుతున్న రహదారుల ప్రాజెక్టులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలసి గడ్కరీ సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో రవాణాకు డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని యోగి సర్కార్ ను గడ్కరీ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement