Friday, May 17, 2024

వారికి పోస్టింగ్స్ ఎప్పుడిస్తారు?: సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎక్సైజు శాఖలో అకారణంగా మూడు సంవత్సరాలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన అధికార్లకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. ఆంధ్ర నుండి తెలంగాణకు కేటాయించిన ముగ్గురు ఎక్సైజ్ సూపెరింటెండెంట్స్  ఎటువంటి కారణం లేకుండా రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ  రాష్ట్రం వచ్చిన తరువాత గడిచిన 7 సంవత్సరాల కాలంలో అన్ని శాఖలతో పాటు ఎక్సైజు శాఖలో 64 ఉన్నతాధికార్లకు పదోన్నతి ఇచ్చి.. అందులో 12 మంది అధికార్లకు ( ఎక్సైజు మినిస్టర్ గౌరవ అధ్యక్షులు గా ఉన్నTGO  కార్యవర్గ సభ్యులు) మాత్రమే పోస్టింగ్ ఇచ్చి మిగతా అధికార్లకు పోస్టింగ్ ఇవ్వకుండా అదే స్థానాలలో కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో నలుగురు అసిస్టెంట్ కమిషనర్లను, ఒక డిప్యూటీ కమీషనర్, ఒక జాయింట్ కమీషనర్, 6 నెలలకు పైగా వెయిటింగ్ లో పెట్టి జీత భత్యాలు లేకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.  

జీత భత్యాలు చెల్లించాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగులను వెయిటింగ్ లో పెట్టి అప్పు తీసుకొని బ్రతకమంటున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎక్సైజు శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. సమస్య పరిష్కారం లేదన్నారు. వెయిటింగ్ లో ఉన్న ఉద్యోగులకు జీత భత్యాలు లేక, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజు లాంటి నేరాలను అదుపు చేసే శాఖలలో 20% అధికార్లను వెయిటింగ్ లో పెట్టి… పని చేస్తున్న అధికారులకే నాలుగు అయిదు అదనపు భాద్యతలు అప్పగించడం వల్ల నేరాలు అదుపు లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు.  

హైదరాబాద్ ఎక్సైజు సూపరింటెండెంట్ కి 3 అదనపు బాధ్యతలు రంగారెడ్డి డీసీకి 4 అదనపు బాధ్యతలు, మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ కు 3 అదనపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఉద్యోగిని వెయిటింగ్ లో పెట్టొద్దన్న రేవంత్.. రిపోర్ట్ చేసిన 10 రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెయిటింగులో  పెట్టిడితే సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.  అంతే కాకుండా సంబంధిత అధికారి జీతం నుండి వెయిటింగ్ అధికారుల జీత భత్యాలు రికవరీ చెయ్యాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement